Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఆటలుక్వార్టర్స్‌కు నిఖత్‌ జరీన్‌

క్వార్టర్స్‌కు నిఖత్‌ జరీన్‌

- Advertisement -

జపాన్‌ బాక్సర్‌పై 5-0తో గెలుపు
ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌

లివర్‌పూల్‌ (ఇంగ్లాండ్‌) : ప్రపంచ చాంపియన్‌, భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొడుతుంది. లివర్‌పూల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్‌ (డబ్ల్యూబి) వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో నిఖత్‌ జరీన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌ 5-0తో జపాన్‌ బాక్సర్‌ నిషినక యునపై ఏకపక్ష విజయం సాధించింది. ఐదుగురు రిఫరీలు నిఖత్‌ జరీన్‌ను మూడు రౌండ్లలో స్పష్టమైన విజేతగా ఎంచుకున్నారు. 29-26, 29-26, 29-26, 30-25, 29-26తో నిఖత్‌ పదునైన పంచులు సంధించి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో చోటు కోసం టర్కీ బాక్సర్‌ నాజ్‌తో నిఖత్‌ జరీన్‌ నేడు తలపడనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad