న్యూఢిల్లీ : యెమన్‌లో ఉరిశిక్షకు సిద్ధమవుతున్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఊరట లభించింది. ఆమె ఉరిశిక్ష అమలు ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలియజేశాయి. 2017లో వ్యాపార భాగస్వామిని హత్య చేశారన్న ఆరోపణపై నిమిష ప్రియకు 2018లో ఉరిశిక్ష విధించారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే శిక్ష నుంచి బయటపడే అవకాశం ఉండడంతో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ వివరాలు మాత్రం తెలియలేదు. కేరళ నర్సుకు అవసరమైన సాయాన్ని అందిం చేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న పక్షాలతో పరస్పర అంగీకారయోగ్య మైన పరిష్కారాన్ని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది చాలా సున్నితమైన అంశమే అయినప్పటికీ యెమన్‌లోని జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో భారత అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, దీంతో శిక్ష అమలు వాయిదా పడిందని ఓ అధికారి చెప్పారు.
నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES