Friday, July 11, 2025
E-PAPER
Homeజాతీయంనిమిషి ప్రియ పిటిషన్‌విచారణ 14న

నిమిషి ప్రియ పిటిషన్‌విచారణ 14న

- Advertisement -

న్యూఢిల్లీ : యెమెన్‌లో జరిగిన ఓ హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. యెమెన్‌ కోర్టు జులై 16న నిమిష ప్రియను ఉరితీయాలని తీర్పు ఇచ్చినట్లు ఆన్‌లైన్‌, టెలివిజన్‌ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సేవ్‌ నిమిష ప్రియ యాక్షన్‌ కౌన్సిల్‌ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. నిమిష ప్రియ విడుదలకు దౌత్య మార్గాల ద్వారా జోక్యం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును ఈ సంస పిటిషన్‌లో కోరింది. నిమిష ఉరిశిక్షను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 14న విచారణ చేపట్టనుంది. గురువారం సీనియర్‌ న్యాయవాది ఆర్‌ బసంత్‌ అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని న్యాయమూర్తులు సుధాంషు ధులియా, జోరుమల్య భాగ్చిలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ ముందస్తు విచారణ కోసం చేసిన అభ్యర్థనను కోర్టు అనుమతించింది. జూలై 14కి విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేయవచ్చు. ఈ పిటిషన్‌ కాపీని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి అందజేయాలని కూడా ధర్మాసనం పిటిషనర్‌ని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -