- Advertisement -
నవతెలంగాణ నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. సాగర్‌కు వరద ప్రవాహం పెరగడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి జలాశయం చేరింది. ఈ క్రమంలో 8 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 65,800 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,10,483 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి, ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ఇక సాగర్ పూర్తి, ప్రస్తుత నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉంది.
- Advertisement -