ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నవతెలంగాణ – జుక్కల్
కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి కౌలాస్ నాలా వాగులోకి వదిలే అవకాశం ఉంది. కావున రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో దండోరా వేయించాలని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేస్తూ నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచించారు. రైతులు కూడా అటువైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు.. ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంతా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు, పోలీస్, రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
నిండుకుండలా కౌలాస్ నాలా ప్రాజెక్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES