వెనకడుగు తెలీని అస్థిత్వ పోరాటంపై
ఆకలిబాంబు పడింది..!
పట్టెడు మెతుకులు కరువైనా
పిడికెడు మట్టిని పదిలంగా
గుండెలకు హత్తుకుని నిలబడ్డారు
సామ్రాజ్యవాదం బూటుకింద
శిరసెత్తిన స్వాభిమానం వాళ్ళు
శత్రువు పావులు కదుపుతూ
కాళ్ల కింద నేల కబళిస్తూనే ఉన్నా
మట్టిని మరుభూమిగా మారుస్తున్నా
మనోసంకల్పాన్ని
బదులుగా సంధిస్తూనే ఉన్నారు
కళ్ల ముందే భవిత కూలిపోతున్నా
పసిమొగ్గలు రాలిపోతున్నా
మరణ శాసనాన్ని ఎదుర్కొంటున్నా
ఆత్మవిశ్వాసం పునాదులపై
మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూనే ఉన్నారు
శత్రువుకి ఆయుధాలు మాత్రమే వున్నాయి
వాళ్ళకి అలుపులేని ఆయువు ఉంది
జాత్యహంకార పదఘట్టనలు
నిత్యం గుండెల్లో ఘనీభవిస్తున్నా
తూరుపు ఆకాశాన పూసే ప్రతి ఉదయానికీ
తాజా చిగుర్లవుతున్నారు.. గాజా ప్రజలు!
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253
నింగీ – నేలా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES