Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండెంటల్‌ డాక్టర్‌, వ్యాపారిపై 'నిర్భయ' కేసు

డెంటల్‌ డాక్టర్‌, వ్యాపారిపై ‘నిర్భయ’ కేసు

- Advertisement -

– నిజామాబాద్‌లో బాధిత మహిళ ఫిర్యాదు
నవతెలంగాణ-కంఠేశ్వర్‌

ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో డెంటల్‌ డాక్టర్‌ కొండ అమర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆయిల్‌ గంగాధర్‌పై లైంగిక వేధింపులు, నిర్భయ కేసు నమోదైనట్టు నిజామాబాద్‌ 4వ టౌన్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ నగరంలో నివాసముండే ఓ యువతి 2021 సంవత్సరంలో ప్రగతినగర్‌లోని ఓ ట్రావెల్స్‌ ఏజెన్సీలో పనిచేశారు. ఆ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు డెంటల్‌ డాక్టర్‌ అమర్‌ పాస్‌పోర్ట్‌ కావాలంటూ ట్రావెల్స్‌ ఏజెన్సీకి వచ్చి సదరు యువతి సెల్‌ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. అనంతరం ఆ యువతికి పలుసార్లు ఫోన్‌ చేస్తూ, అసభ్యంగా మాట్లాడటం, తాము చెప్పిన చోటుకు వస్తే కావాల్సినంత డబ్బులు ఇస్తామని వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు వాపోయారు. అలాగే, నగరానికి చెందిన ఆయిల్‌ గంగాధర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సైతం ఇదేరకంగా వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది. ‘ఐదు వేలు ఇస్తాం.. పదివేలు ఇస్తాం వస్తావా..’ అంటూ వాట్సప్‌కాల్‌ చేస్తూ వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. 2023లో పెండ్లి చేసుకున్న తర్వాత సైతం తరచూ ఆడియో, వీడియో కాల్స్‌ చేస్తూ తీవ్ర మనస్తాపానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులు భరించలేక తన భర్త సహకారంతో సోమవారం పోలీస్‌ ప్రజావాణిలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యను కలిసి ఫిర్యాదు చేసింది. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సీపీ సూచించడంతో మంగళవారం ఉదయం నాలుగో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిం చాల్సిందిగా సంబంధిత నాలుగో టౌన్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -