స్వాగతించిన పార్టీ పెద్దలు
పాట్నా : బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. పాట్నాలోని జేడీయూ హెడ్‌క్వార్టర్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్, జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా నిశాంత్.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తన తండ్రి పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకు న్నారని, అది ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఆయన
జేడీయూలోకి నిర్ణయాన్ని అందరం గౌరవిస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి మార్గదర్శకత్వంలో తామంతా పనిచేస్తామని నిశాంత్ కుమార్ తెలిపారు. 20 ఏండ్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. బీహార్ ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు. పార్టీ కండువా కప్పుకున్న అనంతరం తండ్రి నీతీశ్‌ను కలిసి మిఠాయి తినిపించారు. ఆయన వెంట సంజరు ఝా కూడా ఉన్నారు.
నిశాంత్ ఉపముఖ్యమంత్రి అవుతారా?
బీహార్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో నిశాంత్ డిప్యూటీ సీఎం అవుతారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో తండ్రి రాజీనామా అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వంలో నిశాంత్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారని నితీశ్ కుమార్ సన్నిహితుడు తెలిపారు.
జేడీయూలోకి నితీశ్ తనయుడు నిశాంత్
- Advertisement -
- Advertisement -



