నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఆర్మూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి బేస్ బాల్ పురుషుల సెలక్షన్ ప్రబుల్స్ ఎంపిక నిర్వహించడం జరిగిందని జక్రాంపల్లి గ్రామానికి చెందిన జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినోద్ తెలిపారు. కార్యక్రమానికి ఈ క్రీడాకారిణిలకు మూడు రోజులపాటు శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ సాయన్న క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈనెల 16 నుండి 18 వరకు అదిలాబాద్ జిల్లాలో ఐపి స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరచాలని అన్నారు. జిల్లాకు మరియు స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరీ వినోద్, జిల్లా సాఫ్ట్బాల్ అకాడమీ కోచ్ నరేష్, సీనియర్ క్రీడ కారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బేస్ బాల్ పురుషుల ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES