Thursday, October 23, 2025
E-PAPER
Homeజిల్లాలునిజాంసాగర్ నీటి విడుదల

నిజాంసాగర్ నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్

మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నిజామాబాద్, బోధన్ పట్టణాలకు త్రాగునీటి అవసరల నిమిత్తం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి అలీసాగర్ కు బుధవారం ఉదయం నుంచి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్ట్ ఏఈఈ శివకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిసరాలలో ప్రజలు ఎవరు కూడా కాలువలో దిగరాదని పశువులు, గొర్రెలను కూడా కాలువలో దించరాదని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 17.802 టి ఎం సి లకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 6.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -