నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో బడి బయట పిల్లలు లేకుండా చూడాలని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిజామాబాద్ జిల్లా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ కాలమానిని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. మండలంలో విద్యాభివృద్ధికి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు కృషి చేయాలన్నారు. బడి బయట పిల్లలు లేకుండా, బడేడు పిల్లలంతా బడిలో ఉండేలాగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య, అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు,వ్యాయామ ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు అంజయ్య, రాజేష్, లలిత, తదితరులు పాల్గొన్నారు.
బడి బయట పిల్లలు లేకుండా చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



