స్థానిక ఎన్నికలపై ఈటెల వ్యాఖ్యలు సరికాదు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాయలంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాకీ కార్డు అనేది బీఆర్‌ఎస్ రాజకీయ అంశమని తేల్చి చెప్పారు. ప్రజలకు ఇస్తున్న హామీలపై ప్రశ్నిస్తున్న ఆ పార్టీ బీసీల సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడాన్ని కవిత తప్పు పట్టారు. ఈటెల మాటలు పార్టీ స్టాండా? వ్యక్తిగతమా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులు తేల్చాల్సిన అంశాన్ని ఆయన ముందుగా ఎలా చెబుతారని ప్రశ్నించారు.
గవర్నర్ దగ్గరున్న ఆర్డినెన్స్, బిల్లుల ఆమోదానికి కృషి చేయకుండా బీసీ రిజర్వేషన్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఇష్టా రీతిన ఖారారు చేసిందని ఆరోపించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్టీలు లేకపోయినా వారికి సర్పంచ్ పదవి రిజర్వ్ చేశారని అన్నారు. గిన్నిస్ రికార్డు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను నిర్వహించిందని విమర్శించారు. బతుకమ్మ చీరలు ఇవ్వకుండా తెలంగాణ ఆడపడుచులను కాంగ్రెస్ రెండో ఎడాది మోసం చేసిందని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్‌తో ఎలాంటి సంబంధం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES