- Advertisement -
– నిరసన కార్యక్రమానికి తరలి వెళ్లిన కాటారం సబ్ డివిజన్ పరిధిలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు
నవతెలంగాణ – కాటారం : కార్యాలయ ఆవరణలో సిపిఎస్ (CPS) వద్దు ఓపిఎస్(OPS) ముద్దు అనే నినాదంతో సిపిఎస్ కు వ్యతిరేకంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలో గల గ్రామపంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు,ఇది బిక్ష కాదని, సీపీస్ అనేది ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు భీరెల్లి కరుణాకర్, మల్లికార్జున్, పాగే లక్ష్మి కార్యదర్శుల బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -