– వర్షాకాలం జాగ్రత్తలు తీసుకోండి : సమీక్షా సమావేశంలో సింగరేణి సీఎమ్‌డీ ఎన్ బలరాం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తిలో ఆటంకాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ బలరాం అధికారుల్ని ఆదేశించారు. రోజుకు 2.2 లక్షల టన్నులబొగ్గు ఉత్పత్తి, 2.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలని లక్ష్యాలను నిర్దేశించారు. శనివారంనాడాయన కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున భారీవర్షాలతో ఓపెన్ కాస్ట్ క్వారీల్లో నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉందనీ, దానికోసం ముందస్తుగా సంపులలోని నీటిని తొలగించడం కోసం తగినన్ని మోటార్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గనులవారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్ ఈ అండ్ ఎమ్ డీ సత్యనారాయణరావు, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ మరియు పా కే వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్‌డీఎమ్ సుభాని, డైరెక్టర్ సీపీపీ మనోహర్, జీఎమ్ మార్కెటింగ్ ఎన్వీ రాజశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తిలో ఆటంకాలు వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES