Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాలు వద్దు – జీవితం ముద్దు

మాదకద్రవ్యాలు వద్దు – జీవితం ముద్దు

- Advertisement -

• ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ 
• లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ 
నవతెలంగాణ -పెద్దవంగర
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వద్దు, జీవితం ముద్దు అని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి ఆధ్వర్యంలో బుధవారం పలు  పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని ఆగం చేసుకోవద్దని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్సై ని శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై ఎండీ హిదాయత్ అలీ, ముత్తినేని శ్రీనివాస్, అనపురం రవి, సదానందం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -