Tuesday, July 15, 2025
E-PAPER
Homeఖమ్మంమాదక ద్రవ్యాలు వద్దు - మంచి అలవాట్లే ముద్దు: సీఐ

మాదక ద్రవ్యాలు వద్దు – మంచి అలవాట్లే ముద్దు: సీఐ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : నేటి యువత ముఖ్యంగా విధ్యార్థులు స్వీయ నియంత్రణ తో మెలుగుతూ,  ఏది మంచి ఏది చెడు తెలుసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సీఐ పి.నాగరాజు రెడ్డి సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆద్వర్యంలో ప్రిన్సిపాల్ అద్యక్షతన మాదక ద్రవ్యాలు – యువత భవిష్యత్ అనే అంశం పై సెమినార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు ఆయన చెడు అలవాట్లు కు విద్యార్ధులు దూరంగా ఉన్నట్లయితే సమాజంలో గౌరవం దక్కుతుందని,ఏదో ఒక లక్ష్యం నిర్ణయించుకొని దానిని సాధించడానికి ఇష్టపడి చదువుకోవాలని సూచించారు. దేశాన్ని మాదక ద్రవ్య రహిత దేశంగా నిర్మించేందుకు ప్రతి ఒక్కరు భాద్యత తీసుకోవాలని కోరారు.మాదక ద్రవ్యాల వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని,మారక ద్రవ్యాల గురించి తెలిస్తే 1908 కు పోన్ చేయాలని అన్నారు.

శిక్షణా ఎస్ఐ అఖిల మాట్లాడుతూ ఇప్పటికే దేశంలో 8 శాతం మంది ప్రజలు ఏదో రకం అయిన డ్రగ్స్ కు అలవాటు పడ్డారని,వీటిని నివారించలేపోతే రాబోయే కాలంలో దేశ భవిషత్ ప్రమాదంలో పడుతుందని, అలా జరగకుండా ఉండాలంటే యువత ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ మన ఊరిలోని వారిని కూడా డ్రగ్స్ కు దూరంగా ఉంచే బాధ్యతను విధ్యార్థులు తీసుకోవాలని సూచించారు.

స్టూడెంట్స్ కౌన్సిలర్ ఎం.అశోక్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణ అంశాన్ని పట్టుదలతో తీసుకుందని, భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మించడమే మనందరి లక్ష్యం కావాలని అన్నారు.కార్యక్రమంలో ఏజీఎంఓ అరవింద్ బాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డేగల నరసింహారావు, అధ్యాపకులు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -