Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహుజూరాబాద్‌ నియోజకవర్గంలో డంపింగ్‌ యార్డ్‌ వద్దు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో డంపింగ్‌ యార్డ్‌ వద్దు

- Advertisement -

– సీఎస్‌ రామకృష్ణారావుకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని సిరిసపల్లి గ్రామంలో ఏర్పాటు చేయా లని ప్రతిపాదిస్తున్న డంపింగ్‌యార్డ్‌ పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర అభ్యం తరం వ్యక్తంచేశారు. అక్కడ డంపింగ్‌యార్డ్‌ వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన కలిసి వినతిపత్రం అంద జేశారు. డంపింగ్‌ కారణంగా హుజూరాబాద్‌ మండలం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ అమలైతే పంట పొలాలు, సాగునీరు, తాగునీటి వనరులు, వాతావరణం తీవ్రంగా ప్రభావితమవుతాయని వివరిం చారు. స్థానిక ప్రజల జీవన విధానం దెబ్బతింటుందని తెలిపారు. నూతన విత్తన ఉత్పత్తికి అనుకూలమైన సమశీతోష్ణ వాతావరణం కలిగిన హుజూరాబాద్‌ ప్రాంతాన్ని ”వేస్ట్‌ టు ఎనర్జీ” పేరుతో కాలుష్య కేంద్రంగా మార్చడం అన్యాయమని పేర్కొన్నారు. డంపింగ్‌ యార్డ్‌ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో నిర్మించాల్సిన కల్వల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రభుత్వం పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమని పేర్కొ న్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆరు వేల ఎకరా లకుపైగా వ్యవసాయ భూములకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తుం దని వివరించారు. రైతుల భవిష్యత్తు దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌ను అత్యవసరంగా పూర్తి చేయాలని కోరారు. నియోజవర్గంలోని పలు రహదారుల నిర్మాణ పనులు మధ్య లోనే ఆగిపో వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు అభివృద్ధి పను లకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లు, పనులు చేపట్టిన సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనీ, వాటిని విడుదల చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -