కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
చెన్నయ్ : కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఐఐటి – మద్రాస్‌లో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. త్రిభాషా అంశంపై పార్లమెంటులో ఇప్పటికే స్పష్టత ఇచ్చామని, అయితే కొందరు రాజకీయ ప్రేరేపితంగా పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు పాఠశాలలో తమిళం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మలయాళం, కన్నడ వంటి అనేక భాషలు బోధిస్తున్నారని, తమిళం, ఇంగ్లీష్ కాకుండా అనేక భాషలు బోధిస్తున్నప్పుడు మూడో భాషతో ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ‘ఒకటి నుంచి ఐదు వరకు రెండు భాషలు, ఆరు నుంచి పది వరకు మూడు భాషలు బోధించాలి. మాతృభాష తప్పనిసరి. మిగతా రెండు.. విద్యార్థుల ఐచ్ఛికాలు. కేంద్ర ప్రభుత్వం ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు. రాజకీయ భావజాలం ఉన్నవారు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సమాజంలో కొత్త ఆలోచనను సష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దడం లేదు
- Advertisement -
- Advertisement -