పోషకాహార లోపంతో ఏడాది బాలిక మృతి
ఉదయం నుంచి 35 మంది మృత్యువాత
గాజా : ఆహార సరఫరాను దిగ్బంధించి కనీస ఆహారం కోసం ప్రజలు అలమటించేలా ఇజ్రాయిల్ పాల్పడుతున్న చర్యలతో గాజా ప్రాంత వ్యాప్తంగా ఆస్పత్రుల్లో పోషకాహారం లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గాజాలో ఏమీ మిగల్లేదని గాజా ఎన్‌జీఓ బాస్ ఒకరు వ్యాఖ్యానించారు. పోషకాహార లోపంతో బాధపడుతూ, చికిత్స కోసం ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందంటే జిహెచ్‌ఎఫ్ మానవతా అవసరాలను తీర్చడంలో విఫలమైందని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. పాలస్తీనాలోని ఎన్‌జిలో సంస్థల గ్రూపు డైరెక్టర్ అంజాద్ షావా మీడియాతో మాట్లాడుతూ గాజాలో తినేందుకు ఏమీ మిగల్లేదని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి తరపున ఆహార పంపిణీ బాధ్యత చేపడతామంటూ వచ్చిన జిహెచ్‌ఎఫ్ ఆహార అవసరాలు తీర్చడం కన్నా ఇజ్రాయిల్ రాజకీయ-మిలటరీ ఎజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. ఆహారం కోసం సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలకోర్చి దక్షిణ ప్రాంతానికి వచ్చేలా చేసి అక్కడ వారిపై కాల్పులకు తెగబడుతోందని ఆయన విమర్శించారు. హమాస్ కూడా ఇదే తీరున విమర్శలు చేస్తోంది. పాలస్తీనియన్లను మూకుమ్మడిగా ఆహార కొరతతో చంపేయాలన్నది ఇజ్రాయిల్ లక్ష్యంగా వుందని హమాస్ ఒక ప్రకటనలో విమర్శించింది. సెంట్రల్ గాజాలోని డేర్ అల్ బాలాV్‌ాలో ఏడాది వయస్సున్న బాలిక పోషకాహారం లోపంతో చనిపోయిందని అల్ అక్సర్ అమరవీరుల ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
35మంది మృతి
గాజాలో శుక్రవారం తెల్లవారు జామునుంచి జరిగిన ఇజ్రాయిల్ దాడుల్లో 35మంది మరణించారు. వీరిలో ఆహార కేంద్రాల వద్ద జరిగిన దాడుల్లో మృతి చెందినవారు పది మంది వున్నారు.
గాజాలో ఏం మిగల్లేదు ఎన్‌జీఓ బాస్ వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES