– వారి బతుకులు కాపాడండి : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం-రైతన్నల కన్నీళ్లు, అవస్థలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్యంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కని పెంచిన పిల్లలు కండ్ల ముందే కనుమరుగైనట్టు, ఇంటి దూలం విరిగి ఒక్కసారిగా భుజం మీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలి వానకు తడిసి ముద్ద అయితే అన్నదాతకు ఎంత యాతనా, ఎంత కడుపు కోత? అంటూ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే ఉందని తెలిపారు. పోలీసు పహారా మధ్య, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా కండ్లు తెరవాలని కోరారు. తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వాలనీ, కొనుగోళ్లు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనీ, దేశానికే అన్నం పెట్టే రైతుల బతుకులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఏ కొనుగోలు కేంద్రం చూసినా రైతుల కన్నీటి గాథలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES