13 కోట్ల జన్‌ధన్ ఖాతాలు వాడట్లేదు
పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం, గౌరవం అందిస్తామని ప్రధాని మోడీ హామీ
11 ఏండ్లు గడిచినా సాయం ఉత్తిదే..
న్యూఢిల్లీ : పేదల ఆర్థిక సాధికారత కోసం ప్రవేశపెట్టిన పీఎం జన్ ధన్ యోజన (జేడీవై) బ్యాంకింగ్ ఖాతాలు కనీస లావాదేవీలు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 56.04 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో దాదాపు 23 శాతం అంటే 13.04 కోట్ల ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లోకసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఒక పొదుపు ఖాతాలో వినియోగదారుడి తరఫు నుంచి రెండేండ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే దానిని నిరుపయోగ ఖాతాలుగా గుర్తిస్తారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా 2.75 నిరుపయోగ ఖాతాలు ఉన్నాయి. బీహార్‌లో 1.39 కోట్లు, మధ్యప్రదేశ్ 1.07 కోట్లు చొప్పున అత్యధిక నిరుపయోగ ఖాతాలున్నాయి.
ఈ ఖాతాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం నిరుపయోగ ఖాతాలను యాక్టివేట్ చేయడానికి (రీ-కేవైసీ) చేయడానికి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక క్యాంపెయిన్‌లు చేపడుతోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు సైతం బ్యాంకు ఖాతా సౌకర్యం కల్పించడానికి ప్రధానమంత్రి జన్‌ధన్ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. జన్ ధన్ యోజన ద్వారా పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం, గౌరవం అందిస్తామని ప్రారంభం సందర్బంగా మోడీ పేర్కొన్నారు. మహిళలు, యువత, అట్టడుగు వర్గాలకు బ్యాంకింగ్ సేవలు చేరువ చేస్తామన్నారు. అంతే బ్యాంకుల వద్దకు మహిళలు భారీగా క్యూ కట్టారు. మోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఆచరణకు వచ్చే సరికి ప్రజల వద్ద ఆదాయాలు లేక కోట్ల సంఖ్యలో ఖాతాలు నిరుపయోగంగా మారాయని తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అలాంటి ప్రతిపాదనలేదు..
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే ప్రతిపాదనేదీ లేదని మంత్రి చౌదరి తెలిపారు. యూపీఐ సేవల ప్రోత్సాహానికి ప్రభుత్వం గత నాలుగేండ్లలో రూ.8,730 కోట్ల ప్రోత్సాహాకాలు ఇచ్చిందన్నారు.
పైసల్లేవ్..
- Advertisement -
- Advertisement -