Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండూప్‌ డైలాగులు మానేయ్

డూప్‌ డైలాగులు మానేయ్

- Advertisement -

రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సినిమాల్లో డూప్‌ ఫైటింగులు ఉన్నట్టే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డూప్‌ డైలాగులు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అదేదారిలో బీఆర్‌ఎస్‌ నేతలు కూడా నడుస్తున్నారని చెప్పారు. రెండు పార్టీలు అబద్ధాల పునా దులపై నిలబడుతున్నాయని తెలిపారు. శనివారం హైదరాబాద్‌ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి టి వీరేందర్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు కళ్యాణ్‌నాయక్‌, అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌, నాయకులు గంగాపురం వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం చేతగాక తనపై విమర్శలు చేస్తారా? అని సీఎంను ప్రశ్నించారు. ఆయన్ను అరెస్టు చేస్తే అడ్డుకునేందుకు తానేం సీఎంను కాదని చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి, అక్రమా లు, అబద్ధాల నుంచి తప్పించుకునేందుకు డైవర్ట్‌ పాలిట్స్‌ చేస్తు న్నాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎలాంటి కార్యాచరణ లేదని విమర్శిం చారు. వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందిన సీఎం రేవంత్‌రెడ్డి తన అసమర్థతను తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -