Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఅమెరికాతో అణు చర్చల్లేవ్‌..

అమెరికాతో అణు చర్చల్లేవ్‌..

- Advertisement -

అణు కార్యక్రమం పునరుద్ధరణపై నిపుణుల అధ్యయనం : ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌
టెహరాన్‌ : అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇటీవల తమపై అగ్రరాజ్యం చేసిన దాడులతో గణనీయ మైన నష్టం జరిగిందని పేర్కొన్న ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌, అణు కార్యక్రమం పునరుద్ధరణపై నిపుణులు అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ట్రంప్‌ ప్రకటనకు విరుద్ధంగా..
ఇరాన్‌తో అణు చర్చలపై వైట్‌ హౌజ్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలినా లీవిట్‌ స్పందించారు. ఇరాన్‌తో ఎలాంటి చర్చలు నిర్వహించడం లేదని ఆమె వెల్లడించారు. అయితే, ఒప్పందానికి సంబంధించిన చర్చలు పున:ప్రారంభించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా ఖతార్‌తో మాట్లాడనుందని లీవిట్‌ తెలిపారు. వచ్చేవారం టెహరాన్‌తో అణు చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నాటో శిఖరాగ్ర సమా వేశంలో తెలిపారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్‌తో చమురుపై అమెరికా ఆంక్షలు సడలించే అవకాశాలున్నట్టు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఇరాన్‌ పునర్‌ నిర్మాణానికి నగదు కావాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆ దేశం కోలుకోవడానికి మద్దతు ఇవ్వడం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే అమెరికాతో అణు చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్‌ తేల్చి చెప్పేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad