కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
నవతెలంగాణ – పెద్దవంగర : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న స్థానిక ఫంక్షన్ హాల్ లో జరిగిన బీజేపీ సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి, చౌడ రమేష్ లు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, పెద్దవంగర మండలం గురించి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పై చౌకబారు వాఖ్యలు చేశారు.
ఈ వాక్యాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఖబర్దార్ లేగ రామ్మోహన్ రెడ్డి.. నీకు పాలకుర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకోస్తారా అంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన వ్యక్తి వి నువ్వు కాదా అని ప్రశ్నించారు? నియోజకవర్గ అభివృద్ధికి కోసం ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గాన్ని గత పాలకులు పట్టించుకోకున్నా, ఎమ్మెల్యే ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలను గత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. త్వరలోనే ఆ సమస్యలన్నీటిని పరిష్కారిస్తారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ ముత్యాల పూర్ణచందర్, బోనగిరి లింగమూర్తి, ఎండీ జాను, చిలుక సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES