No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 
శాంతిభద్రతలకు వివాదం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈనెల 11వ తేదీ రాత్రి అందాజ 09.30 గంటలకు మోర్తాడ్ గ్రామానికి చెందిన రొయ్యల సురేష్ మసీద్ ఏరియా నుండి తన కార్ లో వెళుతునడగా మార్గం మద్యలో మసీద్ దగ్గర రోడ్డు పై బైక్ నిలిపి ఉన్న మహమ్మద్ షాహాబాజ్, అబ్దుల్ మజర్ లను బైక్ తీయమని అడుగాగ వారిద్దరూ సురేష్ ని భూతు మాటలు తిట్టి అతని పై బైక్ ఎత్తివేసి, రాడ్ తో తలపై కొట్టి నారు అని అదే సమయంలో అక్కడ ఉన్న ఇంకొందర్ వ్యక్తు వారిద్దరికీ సపోర్ట్ గా వచ్చి సురేష్ ని కొట్టినారు అని అని రొయ్యల సురేష్ భార్య సౌమ్య ఇచ్చిన పిర్యాదు మేరకు మోర్తాడ్ ఎస్‌ఐ బి.విక్రమ్ కేసు నమోధ్ చేసి విచారణ జరిపి రొయ్యల సురేష్ పై బైక్ ఎత్తివేసి రాడ్ తో కొట్టిన షాహాబాజ్, అబ్దుల్ మజర్ లను మరియు వీరిద్దరికీ సపోర్ట్ గా వచ్చి సురేష్ ను కొట్టిన మహమ్మద్ అస్లం, అబ్దుల్ మాలిక్, అబ్దుల్ అర్బస్, మహమ్మద్ ఫయస్ లను అరెస్ట్ చేసి జైల్ కి పంపివడం జరిగింది. కావున నిజామాబాదు పోలీస్ కమీషనరెట్ పరిధిలో ఎవ్వరయిన భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లకు / శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన వారిపై పూర్తి స్థాయి  నిఘా వ్యవస్థ ఉంటుందని ప్రతీ ఒక్కరు తమ నడవడికను మార్చు కోవాలని, లేని యెడల వారి పై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవ్వరికైనా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం 

కలిగిoచడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహారించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య హెచ్చరించడం జరిగింది. పోలీస్ శాఖాపరంగా శాంతియుత వాతావారణం కొరకై నిర్విరామంగా కృషి జరుగుతుందని, ప్రజల సహాకారం అత్యంత ప్రధానమైనదని తెలియజేశారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిoచే వారి సమాచారం ఎవ్వరికైనా తెలిసిన మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని లేదా ఈ దిగువ తెలియజేసిన ఫోన్ నెంబర్లకు తెలియజేయగలరు. సమాచారం ఇచ్చిన పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలియజేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలనుకున్న వారు డయల్ 100, స్పెషల్ బ్రాంచ్ నంబర్ 87126-59777,పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08462-226090 లకు సమాచారం ఇవ్వగలరు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad