Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంఅవి కరుస్తాయని ముందే ఎవరూ ఊహించరు

అవి కరుస్తాయని ముందే ఎవరూ ఊహించరు

- Advertisement -

వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :
వీధి కుక్కల వివాదంపై చేపట్టిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కలు కరవబోతున్నాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేంతవరకు ఎవరూ ఊహించలేరని పేర్కొంది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.కుక్కల కాటు వల్ల మరణాల కన్నా రోడ్డు ప్రమాదాలతోనూ ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్‌లు దాఖలు అవుతుండడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించే ఆలోచిస్తుంటే, ఇతర జంతువుల జీవితాల సంగతేంటి అంటూ ప్రశ్నించింది.
కోళ్లు, మేకల గురించి ఎందుకు మాట్లాడరు?వాటివి ప్రాణాలు కావా అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ను ప్రశ్నించింది. అంతేకాకుండా రోడ్లు, పాఠశాలల వద్ద కుక్కల వల్ల ప్రమాదాలు జరగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాల్లో కుక్కలు కరుస్తోన్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించింది.

అన్ని కుక్కలకు షెల్టర్లు కష్టం
దీనిపై న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్‌ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని తెలిపారు. అయితే భారత్‌లో ఈ పద్ధతులను సరైన విధంగా పాటించకపోవడం, వీధుల్లో చెత్త విపరీతంగా పేరుకు పోవడంతో వీటి బెడద తీవ్రమవుతోందన్నారు. తీహార్‌ జైలులో ఖైదీలకు ఇచ్చే ఆహారం ఏంటో మీకు తెలిస్తే, కుక్కల షెల్టర్లలో ఇచ్చే ఆహారం కూడా అలాగే ఉంటుందని అన్నారు.దీనిపై సుప్రీం కోర్టు, ఎన్‌జీఓలు షెల్టర్లలో ఆహారం అందిస్తాయి అని చెప్పగా, 1.5 కోట్ల కుక్కలకు అది సాధ్యం కాదని సిబిల్‌ అన్నారు.
వీధి కుక్కలను తరలించే అంశంపై అత్యున్నత ధర్మా సనం సుమోటోగా విచారణ చేపట్టింది. అటు విద్యా సంస్థ లు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లలో కుక్కకాటు కేసులు పెరుగు తున్న నేపథ్యంలో గతేడాది నవంబర్‌ 7న కీలక ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి, వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ చేయాలని ఆదేశించింది.

ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్న ప్రదేశంలోనే వదిలేయొద్దని స్పష్టంచేసింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధరించుకునేందుకు క్రమంతప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. జాతీయ రహదారులపై తిరుగుతున్న పశువులను కూడా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు సూచించింది.
జంతు సంక్షేమ ఎన్‌జీవోల తరఫున హాజరైన న్యాయ వాది కాలిన్‌ గోన్సాల్వ్స్‌ వాదిస్తూ దేశంలో కుక్కకాట్ల సంఖ్యను ఉన్నదానికంటే ఐదు రెట్లు ఎక్కువగా ప్రభుత్వ నివేదికలు చూపుతున్నాయని ఆరోపించారు. కుక్క కాటు ఇంజెక్షన్‌ల సంఖ్యను కూడా సరైన విధంగా లెక్కించట్లేదన్నారు. 2021 నుంచి 19 రాష్ట్రాల్లో రేబిస్‌ కేసులు లేవన్నారు. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ, ఎన్సీఆర్‌ పరిధిలో రేబిస్‌ మరణాల సంఖ్య పెరుగుతోందని వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని గతేడాది ఆగస్టు 11న ఆదేశించింది. దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఆ నేపథ్యంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి. అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దానిని విచారిం చింది. ఆ సందర్భంగా రేబిస్‌ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -