Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేట్‌ స్కూల్స్‌ వద్దు.. ప్రభుత్వ బడేే ముద్దు

ప్రయివేట్‌ స్కూల్స్‌ వద్దు.. ప్రభుత్వ బడేే ముద్దు

- Advertisement -

– స్కూల్‌ బస్సును అడ్డుకుని గ్రామస్తుల నిరసన
– జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-రేగొండ

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో యువకులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామస్తులు బుధవారం ప్రయివేట్‌ స్కూల్‌ బస్సులను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ”ప్రయివేట్‌ స్కూల్స్‌ వద్దు.. ప్రభుత్వ బడే ముద్దు” అంటూ నినదిస్తూ స్కూల్‌ బస్సులను ఆపి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రయివేట్‌ పాఠశాలలకు పంపకుండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపి విద్యను అభ్యసించేలా విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరారు. వేలకువేలు ఫీజులు చెల్లించి జేబులు గుల్ల చేసుకోవద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ చైర్మెన్‌ ఊకంటి నిర్మల, ప్రైమరీ స్కూల్‌ చైర్మెన్‌ మచ్చిక వసంత, నాయకులు నిమ్మల విజేందర్‌, రొంటాల వెంకటస్వామి, జున్నుపాల కుమారస్వామి, అకుతోట తిరుపతి, దేశ్మీ కిరణ్‌, మచ్చిక శివ శంకర్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -