Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమూడు నెలలుగా వేతనాలు లేవు..

మూడు నెలలుగా వేతనాలు లేవు..

- Advertisement -

ఇబ్బందులు పడుతున్నాం..
మా కుటుంబాలను ఆదుకోండి…!
నవతెలంగాణ -పెద్దవూర
గ్రామ స్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ఎంపీడీఓ ఉమాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు లేక ఫీల్డ్ సిస్టెంట్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న‌ట్లు ఆవేధన వ్యక్తం చేశారు. అదే విధంగా ఎఫ్ఏల‌ను ఎన్టీటీఈలుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గత 20 ఏండ్లుగా పని చేస్తున్న తమకు పేస్కేల్ వర్తింపజేసి, వేతనాలను పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాల‌న్నారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మా ఫీల్డ్ అసిస్టెంట్లకు పేస్కేల్ వర్తింపచేస్తూ, వేతనాలు పెంచి, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం ఇచ్చిన హమీని నెరవేరుస్తూ మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని విన్నవించారు.

ఉపాధి హామీలో పనిచేయుచున్న మిగతా అన్ని స్థాయిల ఉద్యోగుల మాదిరిగానే మా ఫీల్డ్ అసిస్టెంట్లనులుగా కన్వర్ట్ చేసి కనీసం వేతనం రూ.25,000 లు, హెల్త్ కార్డులు ఇచ్చి విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి,4779 సర్క్యులర్ను రద్దు చేసి లిస్టు 3 క్రింద తొలగించిన ఫీల్డ్ అసి స్టెంట్లను తిరిగి విధులలోనికి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -