నవతెలంగాణ – ఓయూ: ఒడిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఉన్నటువంటి ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా మరియు సెక్సువల్ అరేంజ్మెంట్ చేస్తూ తనని మనోవేదనకి గురిచేశాడని ఆయన ను కఠినంగా శిక్షించాలని ఎన్ ఎస్ యు ఐ నేతలు కోరారు. ప్రొఫెసర్ చేస్తున్నటువంటి సెక్సువల్ అరాజ్మెంట్ పై అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం,ప్రిన్సిపాల్, మరియు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ విద్యార్థినికి న్యాయం దక్కలేదని,తాను ఈ సమాజంలో ఎక్కడా కూడా న్యాయం లేదని మనోవేదనకు గురి అయ్యి కళాశాలలో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందిని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని NSUI ఉస్మానియా యూనివర్సిటీ మేడ శ్రీను ఆధ్వర్యంలో సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ ధైర్యంగా ఉండాలి ఎలాంటి సమస్యలు వచ్చినా సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు అని యూనివర్సిటీ విద్యార్థులతో ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తో పాటు NSUI కార్యకర్తలు పాల్గొని సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతులను తొలగించాలని శ్రీనివాస్ కోరారు.
ఆత్మహత్యలు వద్దు: మెడ శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES