Sunday, May 25, 2025
Homeసినిమాజూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌ లేదు

జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌ లేదు

- Advertisement -

జూన్‌ 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లు బంద్‌ అంటూ వస్తున్న వార్తలను ఫిల్మ్‌ ఛాంబర్‌ ఖండించడంతోపాటు జూన్‌ 1వ తేదీ నుంచి ఎలాంటి థియేటర్ల బంద్‌ ఉండదని స్పష్టత కూడా ఇచ్చింది.
ఈ విషయమై శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్వంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్‌ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘ఇటీవల వినిపిస్తున్న కొన్ని వార్తలను బేస్‌ చేసుకుని ఈ మీటింగ్‌ పెట్టాం. ఈ మీటింగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితిపై ఉన్న కొన్ని సమస్యల గురించి చర్చలు జరగాయి. జూన్‌ 1వ తేదీ నుండి థియేటర్లు మూతపడతాయనే వార్త బయటకు వెళ్ళింది. కానీ అలా థియేటర్లు మూసి వేయడం అనేది జరగడం లేదు. అది పూర్తిగా ఊహగానం మాత్రమే. ఈనెల 30వ తేదీన ఈసీ మీటింగ్‌ ఉండబోతుంది. ఆరోజు మూడు సెక్టార్లకు నుండి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఓ నిర్ణీత సమయంలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా ఆ కమిటీ పని చేయనుంది. దీనికి సంబంధించిన ఎటువంటి వార్తలైనా ఫిలిం ఛాంబర్‌, దాని అనుసంధాన సంస్థల నుండి బయటకు వస్తేనే ఆ వార్తలను మాత్రమే ప్రచారం చేయండి. అంతేకానీ బయటనుండి వేరే ఇతర వార్తలు ఏమైనా వస్తే వాటిని దయచేసి నమ్మకండి, ప్రచారం చేయకండి. ఇవి చిత్ర పరిశ్రమలో అనవసరమైన ఆటంకాలు తీసుకొస్తున్నాయి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -