Wednesday, April 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌ తెరవాలన్న ప్రతిపాదనకు నో

హార్ముజ్‌ తెరవాలన్న ప్రతిపాదనకు నో

- Advertisement -

– ఐరాస తీర్మానానికి రష్యా, చైనా వీటో
– ఓటింగ్‌కు దూరంగా పాక్‌, కొలంబియా
– 11 దేశాల మద్దతు.. విఫలమైన తీర్మానం
– గల్ఫ్‌ దేశాల ఆగ్రహం

న్యూయార్క్‌: హార్ముజ్‌ జలసంధిని తెరవాలని ట్రంప్‌ విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఈ వ్యూహాత్మక సముద్రమార్గాన్ని తెరవడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓటు ప్రక్రియను నిర్వహించింది. అయితే హార్ముజ్‌ను తెరవాలన్న బహ్రెయిన్‌ ప్రతిపాదనను రష్యా, చైనా వీటో చేసి అడ్డుకున్నాయి. ముఖ్యంగా 15మంది సభ్యులున్న భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యులుగా, గల్ఫ్‌ దేశాలకు మిత్రదేశంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు కొలంబియాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానానికి 11 దేశాల మద్దతు లభించింది.కాగా, ఈ తీర్మానం విఫలమవడంపై బహ్రెయిన్‌తో సహా అన్ని గల్ఫ్‌ దేశాలు చైనా, రష్యాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని బహ్రెయిన్‌ పేర్కొంది.
రాయిటర్స్‌ వార్తా సంస్థ ప్రకారం…”హార్ముజ్‌ జలసంధిని తెరవడానికి బలప్రయోగం చేసే అధికారాన్ని ఇస్తూ ముసాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత సవరించిన తీర్మానం బలప్రయోగానికి ఇచ్చిన అధికారాన్ని తొలగించింది”.

నౌకా రవాణా సజావుగా సాగేలా చూసేందుకు, హార్ముజ్‌ జలసంధిలోని వాణిజ్య మార్గాలను ఉపయోగించే దేశాలు, పరిస్థితిని బట్టి రక్షణ సహకారానికి సిద్ధంగా ఉండాలని ఆ తీర్మానం పేర్కొంది.
అటువంటి సహకారంలో వాణిజ్య, వ్యాపార నౌకలకు రక్షణ కల్పించడం కూడా ఉండవచ్చని అందులో తెలిపింది.
ఈ సందరర్భంగా అల్‌ జయానీ మాట్లాడుతూ ”ఈ రోజు మీకు సమర్పించిన తీర్మానం ఆమోదం పొందలేకపోవడంపై ప్రతిపాదిత దేశాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఒక చట్టవిరుద్ధమైన చర్య విషయంలో మండలి తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైంది. హార్ముజ్‌ జలసంధిని ఆలస్యం లేకుండా తెరవడానికి పెద్ద చర్య తీసుకోవాల్సి వచ్చింది.” అని అన్నారు.
”ఈ ముసాయిదా తీర్మానం ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఒక పెద్ద ముందడుగు అవుతుందని మేం ఆశించాం. ఇది హార్ముజ్‌ జలసంధిలో నౌకల స్వేచ్ఛా రాకపోకలను నిర్ధారిస్తుంది, కానీ అది జరగలేదు. హార్ముజ్‌ ఒక జాతీయ జలమార్గం, అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఏ దేశానికి దానిని అడ్డుకునే హక్కు లేదు.” అని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -