Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్చమురు కొనుగోళ్లలో ఉల్లంఘనలు లేవు

చమురు కొనుగోళ్లలో ఉల్లంఘనలు లేవు

- Advertisement -

– రష్యాతో డీల్‌పై మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్‌ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి అన్నారు. ప్రపంచ చమురు మార్కెట్‌ను స్థిరంగా ఉంచడంలో ధరలను నియంత్రించడంలో భారత ఇంధన వాణిజ్య విధానం సహాయపడిందన్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి చాలా కాలం ముందు నుంచే భారత్‌ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి దేశంగా ఉందన్నారు. యుద్ధం తర్వాత కూడా భారత్‌ ఎగుమతులు, లాభాలు దాదాపు అలాగే ఉన్నాయని తెలిపారు. భారత్‌ అన్ని అంతర్జాతీయ నిబంధనలను పూర్తిగా గౌరవించడం వల్లే చమరు బ్యారెల్‌ ధర 200 డాలర్లకు చేరకుండా చూసిందని ది హిందూతో మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 37 శాతంగా ఉంది. అమెరికా ఆంక్షల్లోనూ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad