Tuesday, February 24, 2026
E-PAPER
Homeబీజినెస్బంగారం దిగుమతులపై ఆందోళన లేదు

బంగారం దిగుమతులపై ఆందోళన లేదు

- Advertisement -

– ఆర్బీఐ నిరంతరం పరిశీలిస్తోంది : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ముంబయి
: దేశ బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రస్తుత కరెంట్‌ ఖాతా లోటు నిర్వహించదగిన స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. సోమవారం ఆర్బీఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. దిగుమతుల పరిస్థితిని ఆర్బీఐ నిరంతరం గమనిస్తోందని మంత్రి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇతర దేశాలపై విధిస్తున్న 15 శాతం సుంకాల అంశంపై స్పందిస్తూ.. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను నిశితంగా సమీక్షిస్తోందన్నారు. దీనిపై అప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా బ్యాంకులు బీమా ఉత్పత్తులను తప్పుగా విక్రయించవద్దని తమ కోర్‌ బ్యాంకింగ్‌ సేవలపైనే దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -