నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా డీన్ స్టూడెంట్ అఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల సహకారంతో నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొత్తం 11 విభాగాల్లో పోస్టర్ ప్రజెంటేషన్ వ్యక్తృత్వ పోటీలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో కలిపి 335 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం హాజరై ఈ పోటీలను ప్రారంభించి విద్యార్థుల పోస్టర్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. నోబెల్ ప్రైజ్ డే వంటి వేడుకలు పరిశోధనా దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఆయన విద్యార్థుల పోస్టర్లలోని అంశాలను అడిగి తెలుసుకుని వారి ఆలోచనలను అభినందించారు. అనంతరం బయోటెక్నాలజీ విభాగాన్ని సందర్శించి విద్యార్థుల ప్రజెంటేషన్లను ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. రాధిక, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మనోహర్, ఆయా విభాగాల ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు గోపీనాథ్, సంగీత్, చంద్రశేఖర్, రంగా రెడ్డి, ప్రియాంక, కవిత, మహేందర్, రాజేందర్, సాధు రాజేష్, ఈ.వి. రావు తదితరులు పాల్గొన్నారు.
కేయూలో నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



