నవతెలంగాణ – రాయపర్తి : స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2025లో భాగంగా మండలంలోని కాట్రపల్లి, ఊకల్, రాగన్నగూడెం గ్రామాలలో కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న నోడల్ ఏజెన్సీ ప్రతినిధులు శనివారం సందర్శించారు. అంగన్వాడి, ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, గ్రామపంచాయతీ పని విధానం, పల్లె దవాఖానాల ఫలితాలను, గ్రామాల్లో వ్యక్తిగత నివాస గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో ప్రభుత్వాల నుండి నిర్వహించబడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆన్ లైన్ ద్వారా నివేదిక సమర్పిస్తామని ప్రతినిధులు తెలిపారు. అంగన్వాడి, ప్రభుత్వ పాఠశాలలో దినదినం ఏర్పడుతున్న మార్పుల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తామన్నారు. సహకరించిన మండల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఏజెన్సీ ప్రతినిధులు కే యాకలక్ష్మి, పీ ఉమా, ఎంపీడీఓ జి కిషన్, ఎంపిఓ కూచన ప్రకాష్, స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ శ్రీనివాస రావు, కార్యదర్శులు భూక్య మహేందర్, రాజేందర్, శ్రీనివాస్, అంబేద్కర్, రాజు, సుమలత, తిరుపతి, పూర్ణచందర్, సోమ రాజు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను సందర్శించిన నోడల్ ఏజెన్సీ ప్రతినిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES