Monday, December 1, 2025
E-PAPER
Homeకరీంనగర్జైలు నుంచే నామినేషన్.!

జైలు నుంచే నామినేషన్.!

- Advertisement -

మారుపాకలో సర్పంచ్ రేసుకు కొత్త ట్విస్ట్..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసక్తికర రాజకీయ ఘటన..
నవతెలంగాణ- వేములవాడ

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వినూత్న ఘటన చర్చనీయాంశంగా మారింది. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ కాగా, గ్రామానికి చెందిన బూర బాబు ఈ పోటీలో నిలదొక్కుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు. అయితే, ఓ కేసు నేపథ్యంలో ఆయన గత కొన్నిరోజులుగా జగిత్యాల జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయినా, రాజకీయ సంకల్పం అడ్డులెరుగదన్నట్లు… జైలు గోడల మధ్య నుంచే నామినేషన్ దాఖలు చేయడం జిల్లాలో పెద్ద సెన్సేషన్‌ అయింది.

బూర బాబు భార్య బూర వజ్రమ్మ, గతంలో వేములవాడ అర్బన్ ఎంపీపీగా పనిచేసిన ఆమె, నామినేషన్ పత్రాలను జైలు వద్దకు తీసుకెళ్లగా, బూర బాబు అక్కడే సంతకాలు చేసి అందజేశారు. అనంతరం ఆమె వెళ్లి అధికారికంగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సంఘటనతో మారుపాక గ్రామంలో రాజకీయ చర్చలు,బూర బాబు జైలు నుండి బయటికి వచ్చి స్వయంగా ప్రచారం చేస్తారా..?లేకపోతే భార్య, వారి అనుచరులు ఆయన తరఫున ప్రచార బాధ్యతలు తీసుకుంటారా..?జైలు నుంచే ప్రచార వ్యూహాలు రూపొందించి గెలుపు జెండా ఎగరేస్తారా..?గ్రామ రాజకీయాల్లో ఈ నామినేషన్ కొత్త మలుపు తిప్పగా, మారుపాకలో సర్పంచ్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -