Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

మొండి వీరన్న తండాలో వరి ధాన్యం కేంద్రo పరిశీలన
నవతెలంగాణ – రామారెడ్డి 

రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. శుక్రవారం మండలంలోని అన్నారం నామినేషన్ సెంటర్ను, మొండి వీరన్న తండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరి తేమశాతం, ప్రభుత్వ సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, తూకం, నాణ్యత పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.

నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో మూడు విడుదల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలో వార్డుల వారీగా ఫోటో ఓటర్ జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్, ఎమ్మార్వో హేమలత, ఎంపీడీవో నాగేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -