Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం.. 150కి పైగా నామినేషన్లు దాఖలు

ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం.. 150కి పైగా నామినేషన్లు దాఖలు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండగా, ఆ సమయానికి గేటు లోపల ఉన్నవారికి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -