Friday, January 30, 2026
E-PAPER
Homeకరీంనగర్ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం

- Advertisement -

-రాయికల్ లో 100 నామినేషన్లు దాఖలు 
నవతెలంగాణ – రాయికల్

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయికల్ మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడవ రోజు మొత్తం 57 నామినేషన్లను స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ కె. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 37, బీఆర్ఎస్ నుంచి 27,బీజేపీ నుంచి 25, ఇతర పార్టీల నుండి 6 నామినేషన్లు,అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఐదు నామినేషన్లు సమర్పించినట్లు కమిషనర్ తెలిపారు. గత మూడు రోజుల వ్యవధిలో మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల నుంచి మొత్తం 74 మంది అభ్యర్థులు 100 నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హత పొందిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -