Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండవ రోజు జోరుగా నామినేషన్లు

రెండవ రోజు జోరుగా నామినేషన్లు

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మిర్యాలగూడ నియోజవర్గంలో నామినేషన్ స్వీకరణ రెండో రోజు సోమవారం జోరుగా దాఖలయ్యాయి. ఏకాదశి కావడంతో గ్రామపంచాయతీలలో సర్పంచ్ వార్డు మెంబర్లకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి బొగ్గరపు కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇతని ప్యానెల్ 10 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు తరపున అదే గ్రామంలో కాంగ్రెస్ తరపున బొడ్డు నాగలక్ష్మి సైదులు నామినేషన్ వేశారు. యాదగిరి పల్లి గ్రామంలో సిపిఎం సిపిఐ మద్దతు తెలిపిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇతని తరపున వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. మిర్యాలగూడ మండలంలోని 13  క్లస్టర్ల పరిధిలో ఆయా పార్టీల బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -