నవతెలంగాణ – డిచ్ పల్లి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం మొదటి రోజు డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల్లో ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలకు ఎలాంటి నామినేషన్లు దాతలు కాలేవని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మొదటి రోజులో భాగంగా పలువురు ఆశవాహులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి వచ్చి ఎంపిటిసి జడ్పిటిసి లకు కావలసిన దరఖాస్తులను తమ వెంట తీసుకుని వెళ్లారు. శనివారం వరకు చివరి గడువు ఉండడంతో ఆలోపు తమ నామినేషన్లను చేయనున్నారు. శుక్రవారం సైతం మంచి రోజు ఉండడంతో ముహూర్తాలు చూసుకొని తమ నామినేషన్లను వేయనున్నాట్లు పలువురు అభ్యర్థులు నవ తెలంగాణతో వివరించారు.
దరఖాస్తులు చేసుకుని కార్యాలయం వద్ద అభ్యర్థితో పాటు ఇంకో ఇద్దరికి మాత్రమే పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. హాయ్ అక్క ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఎంపిటిసిల వారిగా కౌంటర్లను నెలకొల్పినట్టు అధికారులు వివరించారు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చేపడుతున్నామని వారు వివరించారు.డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వినోద్ ఆధ్వర్యంలో ఎస్ హెచ్ ఓ లు మహమ్మద్ షరీఫ్ జి సందీప్ లో బందోబస్తును పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఆర్డిఓ సందర్శించి అధికారులకు సూచనలు సలహాలను అందజేశారు.
మొదటి రోజు నామినేషన్లు నిల్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES