Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగులకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ జారీ చేయాలి..

ఉద్యోగులకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ జారీ చేయాలి..

- Advertisement -

బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

గ్రూప్3, గ్రూప్ 4 ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్రిమిలేయర్ పరిధిలోకి రారని, వారికి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్  జారీ చేయాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అనేకమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ మండలాల్లో తహసిల్దార్ కార్యాలయంలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకుంటే జారీ విషయంలో మీరు అనర్హులని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

నాన్ క్రిమిలేర్ సర్టిఫికెట్ జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సర్కులర్ నెంబర్ ఇ/424/2014 . తేదీ.28.07.2014., జి. ఓ.ఏం. ఎస్.నెంబర్.20. ది.31.10.2017 లో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. డైరెక్ట్ గ్రూప్ వన్, డైరెక్ట్ గ్రూప్ టు సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల వేతనం ఎనిమిది లక్షలు పరిమితి మించినప్పుడు నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ కు అనర్హులు అన్నారు. గతంలో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ను సంప్రదించినప్పుడు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అన్ని కార్యాలయాలకు మార్గదర్శకాలు పంపడం జరిగిందన్నారు.  ఉద్యోగులకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు జారీ చేయని తాసిల్దారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యోగులు సలహాలు సూచనల కోసం బీసీ ఉద్యోగుల సంఘాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, బిసి ఉద్యోగుల సంఘం నాయకులు శిరం దాస్ రామ్ దాస్, అంబటి శ్రీనివాస్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -