Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఎస్సీ కాలనీ పాఠశాల ఆటస్థలం కబ్జాకు దళితేతరుల యత్నం

ఎస్సీ కాలనీ పాఠశాల ఆటస్థలం కబ్జాకు దళితేతరుల యత్నం

- Advertisement -

– వినాయక చవితి ఉత్సవాలు నిర్వహణకు అని హెచ్ ఎం కు అభ్యర్ధన
– ఆట స్థలం పాఠశాల కే ఉంచాలని పట్టుబట్టిన దళిత యువకులు
– స్వచ్చందంగా దళిత లు ఫెన్సింగ్ ఏర్పాటు
– సద్దుమణిగిన క్రీడా స్థలం వివాదం
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని నారాయణపురం పంచాయితీ ఎస్సీ కాలనీ ఎంపీపీ ఎస్ కు కేటాయించిన ఆట స్థలంలో దళితేతరులు కొందరు వినాయకచవితి ఉత్సవాలు నిర్వహించడానికి యత్నించగా ఇది గమనించిన దళిత యువకులు కొందరు ఆ స్థలం బడి పిల్లలకు ఆటస్థలం గానే ఉండాలని,మరే ఇతర కార్యక్రమాలు పాఠశాల ప్రాంగణంలో నిర్వహించడానికి కుదరదని ఖరాఖండిగా చెప్పేసారు. ఈ క్రమంలో బీసీ – ఎస్సీ యువకుల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.ఇదే సమయంలో దళితేతరులు కొందరు దేవుడు కి బడి కి కాదు ఈ స్థలం బీసీ కమ్యూనిటీ హాల్ కు వినియోగిస్తామని నోరు జారారు.దీంతో కాలనీ వాసులు ఐక్యంగా శనివారం ఆట స్థలానికి స్వచ్చంగా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసారు.

అసలు ఏం జరిగింది అంటే… నారాయణపురం దళితేతరులు కొందరు శుక్రవారం పాఠశాల కు వచ్చి ఖాలీ స్థలంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించు కుంటాం అని ప్రధానోపాధ్యాయులు లక్ష్మి కాంతం ను అభ్యర్థించారు.

అయితే ప్రధానోపాధ్యాయులు ఈ పాఠశాలకు కొత్తగా రావడంతో గతంలో పనిచేసిన హెచ్ఎం రోజా రమణి కి ఫోన్ చేసి ఆటస్థలం విషయం సమాచారం ఇచ్చారు.వారు సైతం అది పాఠశాల స్థలమే నని అయితే గతంలోను ఇలాంటి సామాజికంగా కార్యక్రమాలకు వాళ్ళు వినియోగించే వారని తెలపడంతో ప్రస్తుత హెచ్ఎం లక్ష్మి కాంతం దళితేతరులు కు అనుమతి ఇచ్చారు. దీంతో వారు పొదలు గా ఉన్న స్థలాన్ని యంత్రాలు సహాయంతో శుభ్రం చేయడం ప్రారంభించారు.

ఇది గమనించిన కొందరు దళిత యువకులు వచ్చి 1986 లో ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఏర్పడిందని,ఆ పాఠశాలకు ఎకరం పైగా సుమారుగా రెండు ఎకరాల వరకు మెయిన్ రోడ్ ప్రక్కనే స్థలం నాటి పెద్దలు కేటాయించారని,బీసీ వర్గీయులు పలువురు దాన్ని దేవుడి పేరుతో ఆక్రమించడానికి పన్నాగాలు పన్నుతున్నారని దళితులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాలు మద్య వాగ్వాదం జరిగి కులం పేరుతో దూషించారని దళితులు ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ క్రమంలోనే శనివారం విద్యార్ధులు,వారి తల్లిదండ్రులు,కొందరు దళిత యువకులు పాఠశాలకు చేరుకుని బడికి కేటాయించిన స్థలం బడి కే ఉండాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్ఐ వీ.రాంమ్మూర్తి పాఠశాలకు చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు.పాఠశాల పరిసరాల్లో ఎలాంటి ఇతర సముదాయాలు ఉండకూడదు అని దళితులు స్వయంగా స్వీయ వ్యయంతో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad