నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో సోమవారం ఉదయం నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. మండలంలోని గుండవాగు లక్నవరం చెరువులు ఇప్పటికే అలుగు పోస్తుండడంతో దెయ్యాలవాగు గుండ్ల వాగు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పసర నుండి మేడారం వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు ఈ రహదారిలో రోడ్డౌన్స్ వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా పరిగణించడంతో రాస్తాను భారీకేట్లతో క్లోజ్ చేశారు.
పసర గ్రామంలో నాన్ స్టాప్ రైన్ ఫాల్ తో ఒక ఇంటి వద్ద భారీ వృక్షం కూలిపోయి వారి బాత్రూం లెట్రిన్ రూములు ధ్వంసం అయిపోయాయి. అదృష్ట శవాత్తు అది ఇంటిపై కూలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కూలిన వృక్షాన్ని తొలగించి విద్యుత్ పునరుద్ధరణ చేశారు. ఎస్సై కమలాకర్ తహసిల్దార్ సృజన కుమారులు ఎప్పటికప్పుడు వరదలను సమీక్షిస్తున్నారు రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.