- Advertisement -
నవతెలంగాణ – వేములవాడ రూరల్
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన చి. సంపత్‌రావు ని ఆదివారం వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, సత్కరించారు. కబడ్డీ ఇతర క్రీడల్లో ప్రోత్సహించడంలో, అభివృద్ధి కోసం సంపత్‌రావు చేస్తున్న కృషిని క్రీడాకారులు అభినందించారు. సన్మాన కార్యక్రమంలో క్రీడాకారులు పొత్తూరి నరేష్, గూగులోత్ తిరుపతి, చి. కిశోర్, చి. ప్రశాంత్, గూగులోత్ సాగర్, ఎస్. మనోజ్‌కుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -