Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి 

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి 

- Advertisement -

ఆస్పత్రిలో ప్రసవాలను నిర్వహించాలి 
గర్భిణీ స్త్రీలు 12 వారాల లోపు పేర్లను నమోదు చేయించుకోవాలి 
జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రవి రాథోడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సిజేరియన్ ఆపరేషన్ వల్ల కలిగే నష్టాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ తెలిపారు. మంగళవారం నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తల నెలసరి సమావేశ  ముఖ్య ఉద్దేశ్యం ఆసుపత్రుల లో ప్రసవాలను నిర్వహించడం, తల్లి బిడ్డల ఆరోగ్యం  పెంపొందించడం, మాతృ మరణాలను తగ్గించడం అని అన్నారు.

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాల పరిధిలో 12 వారాల లోపు గర్భిణీ స్త్రీల నమోదు తప్పనిసరిగా చేయాలని సూచించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలిని, సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలను కోరారు. వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం పూర్తయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

కీటక జనీత వ్యాధులైన మలేరియా, డెంగు, చికెన్ గునియా, ఫైలేరియా నివారణకు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. అలాగే, అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్ కోసం 30 సంవత్సరాల పైబడిన వారందరికీ పరీక్షలు నిర్వహించి, ఆభా కార్డులో నమోదు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ రమ్య, డాక్టర్ చైతన్య, సుపెర్వైజర్స్,  ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -