Wednesday, July 16, 2025
E-PAPER
Homeజిల్లాలువెల్దండ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ..

వెల్దండ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మండల కేంద్ర పరిధిలోని చొక్కన్న పల్లి గ్రామానికి చెందిన తాండ్ర కృష్ణ వేణి అనే మహిళ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. పురీటి నొప్పులతో వచ్చిన కృష్ణవేణి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని సూపర్వైజర్ కవిత, ఏఎన్ఎం జాంగిర్ బి, ఓపి ఏఎన్ఎం సూర్యకళ , సిబ్బంది ఎల్లమ్మ సహకారంతో సాధారణ ప్రసవం జరిగేలా చూశారు. కృష్ణవేణికి మగ బిడ్డ జన్మించగా.. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు పరీక్షలు చేసి నిర్ధారించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ చేయడం హర్షించదగ్గ విషయమై మండలవాసులు ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -