Monday, July 14, 2025
E-PAPER
Homeజిల్లాలుఅంబులెన్స్ లో నార్మల్ డెలివరీ.. తల్లీబిడ్డా క్షేమం

అంబులెన్స్ లో నార్మల్ డెలివరీ.. తల్లీబిడ్డా క్షేమం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని నాచారం గ్రామానికి చెందిన కేతవేణి కేతక్కకి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ అక్కడికి వెళ్లి వారిని నాచారం నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తీసుకెలుతున్న నేపథ్యంలో మార్గ మధ్యలోనే పురిటి నొప్పులు ఎక్కువై అంబులెన్స్ లో కొంపల్లి తండా గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆపి నార్మల్ డెలివరీ చేశారు. ప్రసవించిన తల్లికి మగ బిడ్డ జన్మించినట్లుగా అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డా సురక్షింతంగా ఉన్నారని వారు వెల్లడించారు. అనంతరం వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బొమ్మ హరి ప్రసాద్, పైలట్ చేరి రవీందర్, కేతక్క భర్త కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -