Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంనియంతను కాదు..తెలివైన వాడ్ని

నియంతను కాదు..తెలివైన వాడ్ని

- Advertisement -

– భారత్‌,పాక్‌ యుద్ధంలో ఏడు యుద్ధవిమానాలు కూలారు
– ‘ ఆ దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపా : ట్రంప్‌
వైట్‌హౌస్‌:
నేను ‘నియంత’ని కాదు, ‘చాలా తెలివైన’ వ్యక్తిని అని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారత్‌, పాక్‌ల మధ్య అణు యుద్ధాన్ని ఆపానని పేర్కొన్నారు. సోమవారం వైట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.ఇరాన్‌ అణు స్థావరాలపై బాంబు దాడి చేయడానికి విజయవంతమైన ఆపరేషన్‌ నిర్వహించానని, తన విధానాలు, నిర్ణయాలను సమర్థించుకున్నారు.”భారత్‌,పాక్‌ల మధ్య అణు యుద్ధం ఏర్పడే సమయంలో ఏడు జెట్‌ విమానాలు ధ్వంసమయ్యాయి. ఆ యుద్ధాన్ని ఆపడానికి వారికి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. నేను ఈ యుద్ధాన్ని ఆపాను. అని ట్రంప్‌ చెప్పారు.ఇరాన్‌ అణు స్థావరంపై బాంబు దాడి ‘దోషరహిత ఆపరేషన్‌’ అని ట్రంప్‌ అన్నారు. ఈ ఆపరేషన్‌లో 52 ట్యాంకర్లు , అనేక ఎఫ్‌-22 , బీ-2 బాంబర్లను ఉపయోగించారు. సుంకాల ద్వారా యుద్ధాలను ఆపానని ట్రంప్‌ అన్నారు. సుంకాల శక్తి ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. ఈ విధానం నుంచి ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. అని వివరించారు.
ఉక్రెయిన్‌ యుద్ధం, నాటోతో సంబంధాలు…
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ట్రంప్‌ మాట్లాడుతూ, ”అమెరికా ఇకపై ఉక్రెయిన్‌పై ఎటువంటి డబ్బు ఖర్చు చేయదు. మేము ఉక్రెయిన్‌తో కాదు, నాటోతో వ్యవహరిస్తాము. మేము యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం. ఈ విషయంలో వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడాం” ”రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడం నాకు చాలా సులభం, కానీ ఇప్పుడు అది క్లిష్టంగా మారుతోంది.” అని తెలిపారు.
అణు నిరాయుధీకరణ, భద్రత…
తాను అణ్వాయుధ నిరాయుధీకరణను కోరుకుంటున్నానని, అణు క్షిపణుల గురించి పుతిన్‌తో కూడా మాట్లాడానని చెప్పారు. ఉక్రెయిన్‌ భద్రతా హామీపై, దాని విధానాలను చర్చించలేదన్నారు. నాటోకు క్షిపణు లను ఇస్తామని, వాటిని ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తాయని ఆయన అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad