Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోసంగి కులం కాదు.. బేడ బుడగ జంగాల కులం 

గోసంగి కులం కాదు.. బేడ బుడగ జంగాల కులం 

- Advertisement -

బిబిజె సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు
నవతెలంగాణ – కామారెడ్డి

మాది గోసంగి కులం కాదని బేడ బుడగ జంగాల కులం ఈ విధంగానే మాకు ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రాలు కావాలని కావాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని బిబిజె సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు అన్నారు. కామారెడ్డి పట్టణం 20 వ వార్డులో బేడ  బేడ బుడగ జంగాల కాలనీలో బోర్డును శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు వేణు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో నివసిస్తున్న బేడ బుడగ జంగాల కులస్తులైన వారు గత 30 సంవత్సరాల నుండి గోసంగి కుల సర్టిఫికెట్ మీద జీవనం కొనసాగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

ఈ విషయంపై గత సంవత్సరం నుండి బేడ బుడగ జంగాల కుల సర్టిఫికెట్ మంజూరు కొరకు కామారెడ్డి జిల్లాలో నివసిస్తున్న  బేడ బుడగ జంగాల వారికి అవగాహన కల్పిస్తూ. కామారెడ్డి కలెక్టర్, కామారెడ్డి అడిషనల్ కలెక్టర్, వివిధ మండలాల ఎమ్మార్వోల దృష్టికి ఎన్నో వివిధ కార్యక్రమాలు పాటల, ఆటల ద్వారా బేడ బుడగ జంగాల కుల పత్రాలు మంజూరు చేయాలని వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. బేడ బుడగ జంగం  జన జన సంఘం మరియు కామరెడ్డి జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత నెలలో కామరెడ్డి కలెక్టర్  దృష్టికి బలంగా తీసుకువెళ్లడంతో. కామరెడ్డి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈరోజు డిఎల్ఎస్ కమిటీ వేసి ఎంక్వయిరీ చేయమని ఆదేశాలు మంజూరు చేయడం జరిగింది.

గురువారం మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో నివసిస్తున్న మన బేడ బుడగ జంగాల వార్డుకు డిఎల్ఎస్ కమిటీ సభ్యులు ఎంక్వయిరీ రావడంతో మన ఆచారాలు మన సాంప్రదాయాలు మన కులవృత్తులు వారికి వివరించడంతో జెసి, డి ఎల్ ఎస్ కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించి వెంటనే బేడ బుడగబుడగ జంగాల మంజూరు  చేస్తామని హామీ ఇవ్వడంతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బేడబుడగ జంగం జన  సంఘం కమిటీ సభ్యులు విభూది సాయిలు, బసవ శివ, కొండపల్లి సాయిలు, సంకు పోచయ్య, పస్తo పరుశురాం, కోదండమ్ క్రాంతి,గంధం రాజేష్, బుచ్చయ్య, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ జిల్లా అధ్యక్షులు గిర్నివెంకటి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -